Minister Anagani: అబద్ధాల పునాదుల నుంచి పుట్టిందే వైసీపీ పార్టీ.. మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

అబద్ధాల పునాదుల నుంచి పుట్టిదే వైసీపీ (YSRCP) పార్టీ అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Minister Anagani Satya Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Anagani: అబద్ధాల పునాదుల నుంచి పుట్టిందే వైసీపీ పార్టీ.. మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అబద్ధాల పునాదుల నుంచి పుట్టిందే వైసీపీ (YSRCP) పార్టీ అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Minister Anagani Satya Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబ (YS Family) ఆస్తుల వ్యవహారం తమ ప్రభుత్వానికి సంబంధం లేని విషయమని తెలిపారు. అవసరానికి తగినట్లుగా.. తన క్యారెక్టర్‌ను ఎప్పటికప్పుడు మార్చుకునే వ్యక్తి జగన్ (Jagan) అని ఆరోపించారు. అబద్ధాల పునాదుల నుంచి పుట్టిందే వైసీపీ పార్టీ (YCP Party) అని కామెంట్ చేశారు.

ఐదేళ్లు అధికారంలో ఉండి జగన్ (Jagan) ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం (YCP Government) కారణంగా రాష్ట్రం మరో పదేళ్లు వెనక్కి వెళ్లిందని ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలు చెప్పి.. ప్రతి విషయాన్ని జగన్ (Jagan) నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో జగన్ కోసం షర్మిల (Shamila) పాదయాత్ర చేసిన సమయంలో అందరూ కలిసకట్టుగానే ఉన్నారని గుర్తు చేశారు. కుటుంబంలో ఆస్తుల తగాదాలను షర్మిల (Shamila) బయటపెడితే.. తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story