ఆరోగ్యశ్రీ నిలిచిపోలేదు : సభలో స్పష్టం చేసిన మంత్రి సత్యకుమార్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri) నిలిచిపోలేదని మంత్రి సత్యకుమార్ (Minister Anagani Satya Kumar) తెలిపారు.

ఆరోగ్యశ్రీ నిలిచిపోలేదు : సభలో స్పష్టం చేసిన మంత్రి సత్యకుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri) నిలిచిపోలేదని మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) తెలిపారు. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదన్న ఆయన.. కేవలం పేరు మాత్రమే మారిందని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై చర్చలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేటు ఆస్పత్రులకు ప్రజల సొమ్మును ధారాదత్తం చేసిందని ఆరోపించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని కింద రూ.457 కోట్ల చెల్లింపులు చెసిందని వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్యసేవతో 13.42 లక్షల మంది దీనివల్ల లబ్ధి పొందారని ఆయన వివరించారు. ఎన్టీఆర్ వైద్యసేవతోనే బ్రాండింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.

Next Story