- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ విష ప్రచారం.. మంత్రి అనగాని తీవ్ర ఆరోపణలు
బిల్ గేట్స్ పర్యటనపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి అనగాని ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ (Bill Gates) సోమవారం అమరావతిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ అసత్య ప్రచారం చేస్తోందని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిల్ గేట్స్ పర్యటనపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి బిల్‌గేట్స్ అందిస్తున్న తోడ్పాటును చూసి జగన్ అండ్ కో ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
బిల్‌గేట్స్ సహకారంతోనే హైదరాబాద్ IT హబ్
అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బిల్‌గేట్స్ సహకారంతోనే హైదరాబాద్‌లో IT హబ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పుడు ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో.. ఏపీకి వెన్నుదన్నుగా ఉన్నారని మంత్రి అనగాని తెలిపారు. ఏపీకి బిల్‌గేట్స్ రాకను బ్లూ మీడియా బ్యాచ్ జీర్ణించుకోలేకవట్లేదని విమర్శించారు.






