Minister Anagani: అబద్ధాలు చెప్పడంలో జగన్ సిద్ధహస్తుడు.. మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

అవసరాన్ని బట్టి అబద్ధాలు చెప్పడంలో మాజీ సీఎం జగన్ (Former CM Jagan) సిద్ధహస్తుడని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) ఆరోపించారు.

Minister Anagani: అబద్ధాలు చెప్పడంలో జగన్ సిద్ధహస్తుడు.. మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అవసరాన్ని బట్టి అబద్ధాలు చెప్పడంలో మాజీ సీఎం జగన్ (Former CM Jagan) సిద్ధహస్తుడని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చి హామీలను తుంగలో తొక్కి ప్రజలకు నిలువునా మోసం చేశాడని మండిపడ్డారు. ఐదేళ్లు అధికారంలో ఉండి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిచారని ఫైర్ అయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో హత్యలు, దాడులు, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి చిత్ర హింసలు పెట్టారని గుర్తు చేశారు.

జగన్ (Jagan) రక్షకుడు కాదని.. భక్షకుడని కామెంట్ చేశారు. గాడి తప్పిన విద్యా వ్యవస్థను సరైనా దారిలో పెడుతున్న సీఎం చంద్రబాబు (CM Chandrababu)ది నటన అంటూ జగన్ (Jagan) అనడం ఆయన మూర్ఖత్వమని అన్నారు. వైసీపీ (YCP) పాలనతో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పూర్తిగా పడిపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ (Jagan) నటించడం ఆపేసి కూటమి ప్రభుత్వం మాదిరిగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. లేని పక్షంలో ప్రజలే జగన్‌ (Jagan)ను చీదరించుకునే పరిస్థతి వస్తుందని మంత్రి అనగాని అన్నారు.

Next Story