పవన్ కల్యాణ్ టార్గెట్గా మంత్రి అంబటి కొత్త మూవీ.. టైటిల్ ఏంటో తెలుసా?

by Dishafeatures2 |
పవన్ కల్యాణ్ టార్గెట్గా మంత్రి అంబటి కొత్త మూవీ.. టైటిల్ ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ ద్వారా తనను కించపరిచారంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే పూర్తి పొలిటికల్ సెటైరికల్ సినిమా తీయాలని, అంతేగానీ శత్రువులను కించపరిచేందుకు సినిమాలో సీన్లు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని బ్రో నిర్మాతలు, నటులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మంత్రి అంబటి .. త్వరలోనే తాము ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. పరోక్షంగా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ తాము తీయబోయే సినిమాలో హీరో పెళ్లిల్ల మీద పెళ్లిల్లు చేసుకుంటారని, పిల్లలు మీద పిల్లలను కంటారని సెటైర్లు వేశారు.

ఇక తాము తీయబోయే సినిమాకు సంబంధించి పలు టైటిళ్లను ఆయన మీడియాకు వెల్లడించారు. నిత్య పెళ్లికొడుకు, మూడు ముళ్లు.. ఆరు పెళ్లిల్లు, పెళ్లీలు.. పెటాకులు, తాళి.. ఎగతాళి, అయిన పెళ్లిల్లు ఎన్నో.. పోయిన చెప్పులు ఎన్నెన్నో వంటి అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అలాగే ‘మ్రో’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నామని సైటైర్లు వేశారు. M అంటే మ్యారెజెస్, R అంటే రిలేషన్స్, O అంటే అఫెండర్స్ అని అన్నారు. తమది చాలా తక్కువ బడ్జెట్ సినిమా అని, త్వరలోనే సినిమాను స్టార్ట్ చేస్తామని మంత్రి చెప్పారు.

Also Read: తెలుగు సినిమాపై తాప్సీ కామెంట్స్.. మూవీ హిట్ అయితే హీరోకు జేజేలు.. లేదంటే హీరోయిన్లు బలి

పవన్ ‘బ్రో’ సినిమా అట్టర్ ప్లాఫ్.. మంత్రి అంబటి రాంబాబు

Next Story

Most Viewed