- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌కు పనికిరాడు: మంత్రి అంబటి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ డైలాగ్‌లు సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ రాజకీయాల్లో పని చేయవని అన్నారు. ఇక, తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కదని గోబెల్స్ ప్రచారం జరిగిందని మండిపడ్డారు. తాను అసెంబ్లీకి వెళ్లకుండా టీడీపీ, జనసేన, బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఈ సారి ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓడినట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి నుండి అనిల్ కుమార్ యాదవ్‌కు అత్యధిక మెజార్టీ రావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని.. జగన్ రెండోసారి సీఎం అవ్వడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Read More..






