బానిసగా ఉంటూ చేగువేరా అని ఎలా అంటారు?.. పవన్‌‌పై నిప్పులు చెరిగిన అంబటి

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-11-26 15:34:41  IST  )

బానిసగా ఉంటూ చెగువీరా అని ఎలా అంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు..

బానిసగా ఉంటూ చేగువేరా అని ఎలా అంటారు?.. పవన్‌‌పై నిప్పులు చెరిగిన అంబటి
X

దిశ, వెబ్‌డెస్క్: బానిసగా ఉంటూ చేగువేరా అని ఎలా అంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్ విశాఖ పర్యటనలో సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పవన్‌కు గడ్డం పెరిగినా.. ఫ్లైట్ లేట్ అయినా అందుకు సీఎం జగనే కారణమని అంటాడని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబును గెలిపించేందుకే టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్ పల్లకి పవన్ మోస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ సామాజిక వర్గాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఒకరి పల్లకి మోసే వ్యక్తిని ఆ సామాజికవర్గం గుర్తించదని, మోస పోవడానికి సిద్ధంగా లేరని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు ఏపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. పవన్ సొంత ఊరు, ఇల్లు, ఓటు కూడా లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి, పవన్ బీజేపీకి సపోర్టు చేయడం ఇంతకాన్నా నీచ రాజకీయం ఉండని అంబటి రాంబాబు విమర్శించారు.

Next Story