ఇదొక్కటే కాదు.. ఇంకా చాలా స్కామ్‌లు జరిగాయి: Minister Gudivada Amarnath..

by Malleboina Mahesh |   (  Updated:2023-09-09 06:32:50  IST  )

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఈ రోజు తెల్లవారుజామున నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాబు అరెస్ట్ పై రాష్ట్ర ఐటీ మంత్రి అమర్నాథ్ స్పందించారు.

ఇదొక్కటే కాదు.. ఇంకా చాలా స్కామ్‌లు జరిగాయి: Minister Gudivada Amarnath..
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఈ రోజు తెల్లవారుజామున నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాబు అరెస్ట్ పై రాష్ట్ర ఐటీ మంత్రి అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ అంటూ.. ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచేశారు. అలాగే ప్రజా ధనాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకున్నారు. షెల్ కంపెనీలో ఎంవోయూ అంటూ నాటకం ఆడారన్నారు. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌ వెనుక ఉన్నది చంద్రబాబే అని.. ఇంతవరకు ఈ స్కామ్‌లో తన ప్రమేయం లేదని బాబు ఒక్క సారి కూడా చెప్పలేదన్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్డ్ క్రిమినల్ అని.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని సెటైర్లు వేశారు. అలాగే బాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఒక్కటే కాదని.. ఇంకా చాలా స్కామ్‌‌లు జరిగాయని మంత్రి అమర్నాథ్ మీడియాతో అన్నారు.

Read More : త్వరలో నారా లోకేష్ కూడా అరెస్ట్..? సీఐడీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబుకు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం.. సీఐడీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Next Story