- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని ఆధారాలతో వచ్చాం... అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిద్దాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ప్రజల సమస్యలపై చర్చించేందుకు ధైర్యం లేనివారు ఇప్పుడు గురుకులాల పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని, స్పీకర్ వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, గురుకుల టెండర్లతో పాటు అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరగాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రజల సమస్యలపై చర్చించేందుకు ధైర్యం లేనివారు ఇప్పుడు గురుకులాల పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని, స్పీకర్ వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, గురుకుల టెండర్లతో పాటు అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరగాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. చర్చకు తేదీ, సమయం నిర్ణయించండి పూర్తి ఆధారాలతో వచ్చి ప్రజల ముందు నిజాలు వెల్లడిస్తామని, మాటలతో కాదు, ఆధారాలతో రండి, ఆరోపణలతో కాదు, చర్చతో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. గురుకులాల టెండర్ల ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకే జరిగిందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
రూ.686 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని, ప్రతి దశకు పూర్తి వివరాలు, ఆధారాలు మా వద్ద ఉన్నాయని, దాదాపు రూ.400 కోట్ల పనుల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. ఎక్కడా అవకతవకలకు, అక్రమాలకు, పొరపాట్లకు తావులేకుండా టెండర్ల ప్రక్రియను నిర్వహించామని, హరీశ్‌రావుతో పాటు ఆయన భజన బృందం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని మంత్రి అడ్లూరి కొట్టిపారేశారు. ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలతో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
మీ నాయకుడు ఫామ్‌హౌస్‌కే పరిమితమై ఉంటే, ప్రజా సమస్యలపై మాట్లాడేది ఎవరు? తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతి, నిర్లక్ష్యానికి సంబంధించిన పూర్తి పాపాల చిట్టా మా వద్ద ఉందని మంత్ర అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. మేము మీలా తోక ముడుచుకుని పారిపోయేవాళ్లం కాదని, ప్రజల ముందు నిలబడి సమాధానం చెప్పేవాళ్లమన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేస్తున్న ఆరోపణలకు మా పార్టీ అధికార ప్రతినిధులే తగిన సమాధానం చెబుతారని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.






