బ్రేకింగ్: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Satheesh |

మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

బ్రేకింగ్: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం విశాఖలోని ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తం చేయడంతో మంత్రి ఆదిమూలపు సురేష్ టేకాఫ్ కాకుండానే దిగిపోయారు. ఇతర మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు అంతా ఊపీరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story