Minister Achanna: మూడు రాజధానులని నాటకాలాడారు.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఐదేళ్లు అధికారంలో వైసీపీ (YCP) రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా నాటకాలు ఆడిందని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achennaidu) అన్నారు.

Minister Achanna: మూడు రాజధానులని నాటకాలాడారు.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్లు అధికారంలో వైసీపీ (YCP) రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా నాటకాలు ఆడిందని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achennaidu) అన్నారు. ఇవాళ శాసన మండలి (Legislative Council)లో రాజధాని అమరావతి (Amaravati)పై అధికార, విపక్ష పార్టీ సభ్యల మధ్య మాటల యుద్ధం జరగింది. ఈ క్రమంలోనే అమరావతి శ్మాశానం అంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Former minister Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ క్రమంలో బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ (TDP Government) హయాంలో అమరావతి (Amaravati)లో చేపట్టిన నిర్మాణాలను గత ప్రభుత్వం ఐదేళ్లు నీటిలో ముంచిందని ఫైర అయ్యారు. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ నాటకాలు ఆడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీనియర్ సభ్యుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ రుషికొండ (Rushikonda) నిర్మాణాలపైనా అభ్యతరం చెప్పలేదని ఆరోపించారు.

ఇక వెలిగొండ ప్రాజెక్ట్‌ (Veligonda Project)కు పైసా నిధులు కేటాయించలేదంటూ విపక్షం ఆరోపిస్తోందని.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పూర్తి కాని ప్రాజెక్ట్‌ను జాతికి జగన్‌ (Jagan) అంకితం చేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ (Visakhapatnam Steel Plant)ను నాశనం చేసిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తున్నామని మంత్రి సమాధానమిచ్చారు. అటు అసెంబ్లీలో మిర్చి రైతుల గురించి వైసీపీ సభ్యులు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వ పాలనలో గుంటూరు మిర్చి యార్డు (Guntur Mirchi Yard) అవినీతిమయంగా మారిందని అన్నారు. మిర్చి ధరలపై సీఎం చంద్రబాబుతో సహా తాను కూడా సమీక్షలు నిర్వహించానని అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు.

Next Story