పవన్ ఇలాకలో అనూహ్య పరిస్థితి.. మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా పెరిగింది...

పవన్ ఇలాకలో అనూహ్య పరిస్థితి.. మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా(Mining Mafia) పెరిగింది. ప్రతి రోజూ 200 లారీలు ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ విషయంపై ఇప్పటి పవన్ కల్యాణ్ సిరీయస్ వార్నింగ్ ఇచ్చినా నియోజకవర్గం నుంచి యదేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ(Former TDP MLA Verma) ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి తవ్వుకున్న రైతు(Farmer)ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. అలాగే ఇసుక అక్రమ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపైనా ధ్వజమెత్తారు. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే పోలీసులు నాలుగు రోజులు స్టేషన్‌లో ఉంచుతున్నారని వర్మ తెలిపారు. అదే అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ విషయంపై పవన్ కల్యాణ్ హెచ్చరించారని గుర్తు చేశారు. రోజుకి 200 లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని, పోలీసులు ఎందుకు కళ్లు మూసుకుంటున్నారని ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ ప్రశ్నించారు.

Next Story