- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాడు హైదరాబాద్‌ను మార్చిన ‘మైక్రోసాఫ్ట్’.. నేడు విశాఖను మార్చనున్న గూగుల్
హైదరాబాద్‌కు దిగ్గజ ఐటీ కంపెనీలు రావడానికి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషి అనిర్వచనీయం అనడంలో అతిశయోక్తి లేదు.

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు దిగ్గజ ఐటీ కంపెనీలు రావడానికి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషి అనిర్వచనీయం అనడంలో అతిశయోక్తి లేదు. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలతో పాటు మరెన్నో కంపెనీలను చంద్రబాబు ఇక్కడికి తీసుకురావడానికి కీలక భూమిక పోషించారు. దీంతో హైదరాబాద్ ఒక పెద్ద ఐటీ హబ్‌గా ఎదిగింది. ఎంతో మందికి ఉపాధి మార్గంగా నిలిచింది. ఇదే అవకాశం మరోసారి చంద్రబాబు నాయుడికి వచ్చింది. అయితే ఈసారి మాత్రం హైదరాబాద్ కాదు.. తాను ఇప్పుడు సీఎంగా ఉన్న ఏపీలోని విశాఖపట్నం హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందనుంది. దానికి కారణం టెక్ దిగ్గజమైన ‘గూగుల్’ సంస్థ విశాఖకు రావడమే. దేశంలోని ఏ నగరాన్నీ కాదని గూగుల్ ప్రతినిధులు విశాఖనే ఎంచుకోవడం మరో విశేషంగా చెప్పాలి. దీంతో హైదరాబాద్ తరహాలో విశాఖ కూడా అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి కృషితో గతంలో హైదరాబాద్ రూపురేఖలను ‘మైక్రోసాఫ్ట్’ కంపెనీ మార్చివేసిందని పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ ఫొటోను షేర్ చేసింది. గతంలో హైదరాబాద్ రూపురేఖలను మైక్రోసాఫ్ట్ మార్చిన విధంగానే ఇప్పుడు ఏపీలోని విశాఖను ‘గూగుల్’ కంపెనీ మార్చివేస్తుందని పేర్కొంది. మరోవైపు దీనికి సంబంధించిన ఒప్పందాలు పూర్తి కావడం, త్వరలోనే ఇక్కడ హబ్ ఏర్పాటు కానుండడంతో చంద్రబాబు మరోసారి చరిత్ర తిరగరాయనున్నారని టెక్ వర్గాల్లో వినిపిస్తోంది.






