- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతికి బిల్ గేట్స్.. సాదర స్వాగతం పలికిన సీఎం, మంత్రులు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్.. తన టీమ్ తో కలిసి అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ విమానం గన్నవరం విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ అయింది. తెల్లవారుజామునే గన్నవరానికి సమీపంలోకి వచ్చిన విమానం.. పొగమంచు కారణంగా ల్యాండింగ్ చేసేందుకు విజిబులిటీ లేకపోవడంతో కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం చేరుకున్న బిల్ గేట్స్ కు మంత్రి నారా లోకేశ్ మంగళగిరి శాలువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఆయనతో పాటు మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ ఉన్నారు. కలెక్టర్ బాలాజీ.. కృష్ణాజిల్లా పెడన కలంకారీ వస్తువుల్ని చేతివృత్తితో ప్రత్యేకంగా తయారు చేసిన గోధుమ గడ్డి బాక్సులో బహుమతిగా అందజేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని సచివాలయానికి చేరుకోగా.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఆహ్వానం పలికారు. అనంతరం సచివాలయంలోనే భేటీ అయ్యారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను రాష్ట్రంలో విస్తరించే అంశంపై చర్చించనున్నారు. అలాగే RTGSలో పాలనకు టెక్నాలజీని వాడుతున్న తీరును పరిశీలించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించనున్నారు.






