- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ, విజయవాడ మెట్రో టెండర్లపై.. మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు అయిన విజయవాడ, విశాఖ పట్టణంలో మెట్రో నిర్మాణం చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) తమ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు అయిన విజయవాడ (Vijayawada), విశాఖ పట్టణం (Visakhapatnam)లో మెట్రో నిర్మాణం చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు నగరాల్లో మెట్రో నిర్మాణాలకు (metro Construction) సంబంధించిన రూట్ మ్యాప్ ను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. అయితే విశాఖ, విజయవాడ మెట్రో టెండర్ల (Metro tenders)పై ఈ రోజు ఉదయం.. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి (MD Ramakrishna Reddy) కీలక ప్రకటన చేశాడు. విశాఖ మెట్రో టెండర్లకు వచ్చే నెల 10 వరకు, విజయవాడ మెట్రో టెండర్లకు వచ్చే నెల 14 వరకు గడువు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
అలాగే ఈ టెండర్లలో జాయింట్ వెంచర్స్ (Joint Ventures)కు అవకాశం ఇచ్చామని, 3 కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకోవచ్చని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ సంస్థల (Contract organizations) వినతి మేరకు నిర్ణయం తీసుకున్నామని, ఈ నిర్ణయం వల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ రెండు ప్రాజెక్టులను తక్కువ సమయంలో పూర్తి చేసి.. నిర్మాణ వ్యయం తగ్గించాలనేదే తమ ఉద్దేశమని ఈ సందర్భంగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (AP Metro Rail Corporation) ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.






