- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర వడగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!
రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ(Department of Meteorology) కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రేపు(సోమవారం) పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ(Disaster Management Organization) తాజాగా వెల్లడించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharama Raju District)లోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, మారేడుమిల్లి, నెల్లిపాక, వైరామవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District) గరుగుబిల్లి, గుమ్మ లక్ష్మీపురం, జియ్యమ్మవలస, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాల్లోనూ, ఏలూరు జిల్లా(Eluru District) కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు పగటి పూట బయటకు రావొద్దని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.






