- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు...

దిశ, వెబ్ డెస్క్: వాయవ్య బంగాళాఖాతం(Bay of Bengal)లో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ అల్పపీడనం(Low Pressure) మరింత బలపడి ఒడిశా(Odisha) దగ్గర తీరం దాటే అవకాశ ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officials) తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాకు అధికారులు భారీ వర్ష సూచన చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు జిల్లాలో మోస్తరు వానలు పడతాయని పేర్కొన్నారు.
అలాగే ఈశాన్య తెలంగాణ(Telangana)పైనా అల్పపీడనం ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు చెప్పారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కొమురంభీం, భూపాలపల్లి, కరీంనగర్‌లో భారీ వర్షాలు, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.






