Breaking: ఏపీలో RAINSపై కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

ఏపీలో RAINSపై వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది...

Breaking: ఏపీలో RAINSపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు(Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల పాటు ఏలూరు(Eluru), ఎన్టీఆర్(Ntr) జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయని హెచ్చరించింది. శ్రీకాకుళం(Srikakulam),అల్లూరి, పార్వతీపురంలో శుక్రవారం వరుణుడు విరుచుకుపడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. దీంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇందుకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. ఈ మేరకు దక్షిణ ఒడిశా, ఉత్తరకోస్తావైపు అల్పపీడనం కదులుతోందని, దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Next Story