- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IMD:రాష్ట్రానికి వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
దిత్వా తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి

దిశ,వెబ్‌డెస్క్: దిత్వా తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షం(Heavy Rain) కురిసింది. దీంతో తిరుపతి జిల్లా తొట్టంబేడులో 47.2 మి.మీ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 37.5 మి.మీ, తిరుపతి జిల్లా మన్నారుపోలూరు 32.7 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh) ప్రజలకు IMD మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో తమిళనాడులో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ(గురువారం) తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.






