- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Ap: రేపు అల్లూరి జిల్లాలో తీవ్ర వడగాల్పులు

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు(Temperatures) క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఎండల తీవ్రత(Sun Intensity) సైతం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు బయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. అది కూడా గొడుగుల సాయంతోనే బయటకు వస్తున్నారు. గొడుగులు లేని వారు ఎక్కడ చెట్టు నీడ కనిపిస్తే అక్కడ నిల్చుంటున్నారు. ఈ ఎండలకు తోడు వడగాల్పులు కూడా వీస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. అడ్డతీగల, దేవిపట్నం, గంగవరం, రంపచోడవరంతో పాటు ప.గో. జిల్లా ఆకివీడు మండలంలో తీవ్ర వడగాల్పులు ఉంటాయని వెల్లడించింది. మొత్తం 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ గాల్పులకు తోడు ఎంత తీవ్రత తోడవుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, ఎక్కువగా నీటిని తాగాలని స్పష్టం చేసింది.