- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్నాడులో మరో మెలియాయిడోసిస్ కేసు.. ఎయిమ్స్‌కు బాధితుడి తరలింపు
గత నెలలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మెలియాయిడోసిస్ కేసులు కలకలం రేపాయి.

దిశ, వెబ్‌డెస్క్: గత నెలలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మెలియాయిడోసిస్ కేసులు కలకలం రేపాయి. తురకపాలెం గ్రామంలో ప్రజలు అస్వస్థతకు గురికావడం, పలువురు మరణించడంతో లక్షణాలున్నవారికి వైద్య పరీక్షలు చేయగా.. మెలియాయిడోసిస్ ఉన్నట్లు తేలింది. దాంతో గ్రామంలో వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి.. బాధితులకు చికిత్స అందించారు. తాజాగా పల్నాడులో మరో మెలియాయిడోసిస్ కేసు బయటపడింది.
వెల్దుర్తి మండలం వజ్రాలపాడు పంచాయతీ పరిధిలో ఉన్న దావుపల్లితండాలో ఒక వ్యక్తికి మెలియాయిడోసిస్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు చేశారు. అతనికి వ్యాధి సోకినట్లు నిర్థారణ కావడంతో మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. గ్రామంలో మెలియాయిడోసిస్ కేసు నమోదవ్వడంతో జిల్లా వైద్యార్థికారి రవి అప్రమత్తమయ్యారు. గ్రామస్తులు ఆందోళన చెందవద్దని, ఇది బురద, మట్టిలో ఉండే బ్యాక్టీరియా కారణంగా సోకుతుందని తెలిపారు. ఆయన ఆదేశాలతో గ్రామంలో సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు.






