CM చంద్రబాబు బర్త్ డే.. మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-21 12:35:12  IST  )

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

CM చంద్రబాబు బర్త్ డే.. మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) విష్ చేశారు. ‘‘దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు. మీ లాంటి నాయకుడు దొరకడం తెలుగు ప్రజల అదృష్టం. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు 75వ జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ పెట్టారు. చిరు పెట్టిన ఈ ట్వీట్‌ను అటు టీడీపీ శ్రేణులు, మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ‘ఎక్స్‌’ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అనితర సాధ్యుడు చంద్రబాబుకు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింపచేయడం ఆయన వంటి దార్శనికుడికే సాధ్యం. చంద్రబాబు విజన్‌, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తు అంచనా వేసి వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా’’ అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సైతం విష్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

Click For Tweet Post..

Next Story