- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: అసెంబ్లీలో బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటం చూశా : మెగాస్టార్ చిరంజీవి
ఏపీ అసెంబ్లీలో తనపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో తనపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానం మేరకే ఆయన్ను కలిసేందుకు వెళ్లానని చిరంజీవి స్పష్టం చేశారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని, ఆయన నివాసానికి వెళ్లి కలిసినపుడు సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందుల గురించి వివరించానని తెలిపారు. అప్పట్లో కోవిడ్ ఉండటంతో ఐదుగురే రావాలని జగన్ సూచించగా.. 10 మంది వస్తామని చెప్పానన్నారు. తాము జగన్ ను కలిసేందుకు వెళ్లే సమయంలో బాలకృష్ణకు ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు. జెమిని కిరణ్ ను బాలకృష్ణను కలిసి విషయం చెప్పాలని పంపగా.. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ అందుబాటులోకి రాలేదన్నారు. ఆర్ నారాయణమూర్తి సహా.. కొందరం జగన్ ను లంచ్ సమయంలో కలిశామని , మళ్లీ సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పానని చిరంజీవి వెల్లడించారు. ఇందుకు జగన్ తో జరిగిన సమావేశంలో ఉన్నవారంతా సాక్ష్యులేనన్నారు.
సీఎం అయినా, సామాన్యులైనా సహజ ధోరణిలో తానెప్పుడూ గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగానే మాట్లాడుతానన్న చిరంజీవి.. బాలకృష్ణ ఒకింత వ్యంగ్యంగా మాట్లాడటం టీవీలో చూశానని, తనపేరు ప్రస్తావనకు రావడంతోనే వివరణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను చొరవ తీసుకుని అప్పటి సీఎం జగన్ తో మాట్లాడటం వల్లే.. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల టికెట్ల ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని చిరంజీవి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. తాను విదేశాల్లో ఉన్న కారణంగానే బాలకృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలపై ఇలా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Read More : అసెంబ్లీలో బాలయ్య సీరియస్.. తనను అవమానించారంటూ ఆగ్రహం






