ఇవాళ ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్..ఏకంగా 2.28 కోట్ల మందితో

by velandi.Saikiran |   (  Updated:2025-07-10 01:48:36  IST  )

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇంతవరకు ఏ సర్కార్ చేయ

ఇవాళ ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్..ఏకంగా 2.28 కోట్ల మందితో
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇంతవరకు ఏ సర్కార్ చేయని పని చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0 (Mega Parent Teacher Meet) నిర్వహించబోతున్నారు. ఒకే రోజు రెండు కోట్ల మందితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం.

ఈ సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీచర్లతో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu naidu), నారా లోకేష్ ( Nara Lokesh) కూడా పాల్గొనబోతున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ 10 గంటలకు శ్రీ సత్య సాయి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ఈ కార్యక్రమంలో రెండు కోట్లకు పైగా పాల్గొనబోతున్నారు. ఇ నేపథ్యంలో... ఈ మెగా ఈవెంట్ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కబోతుందని అంటున్నారు.

ఈ మెగా కార్యక్రమంలో దాదాపు 74,96,228 మంది విద్యార్థులు పాల్గొంటారు. 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు కూడా పాల్గొనబోతున్నారు. అలాగే దాతలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని చెబుతున్నారు. పాఠశాల విద్యలో తల్లిదండ్రుల పాత్ర అలాగే ఉపాధ్యాయుల సహకారం పై ఈ సందర్భంగా చర్చ జరగనుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, డ్రగ్ ఎడిక్షన్ అంశాలపై కూడా అవగాహన నిర్వహించనున్నారు.

Next Story