- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. వైద్య విద్యార్థులు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెంలోని ఓ ఇంటిలోకి కారు దూసుకెళ్లింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లాలో (Nellore) ఘోర ప్రమాదం జరిగింది. కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెంలోని (potireddipalem) ఓ ఇంటిలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ముంబై హైవే రోడ్డు పక్కనే ఉన్న పోతిరెడ్డి పాలెం గ్రామం వద్ద మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది ప్రమాదంలో వైద్య విద్యార్థులు అభిషేక్, నరేష్ మృతి చెందారు. అభిషేక్, నరేష్ నారాయణ వైద్య కళాశాలలో (Medicos) ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. రోడ్డు పక్కనే ఉన్న మట్టి గుట్టను ఎక్కించడంతో మూడు పల్టీలు కొట్టి.. పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకుపోయింది. ఇంట్లో ఉన్న వెంకటరమణయ్య అనే వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. మొత్తం కార్లో ఐదుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. గాయాల పాలైన మిగిలిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.






