నెల్లూరులో వైద్య విద్యార్ధి సూసైడ్

by Muthe.Rajitha |

ఏపీలో ఓ వైద్య విద్యార్ధి సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపింది.

నెల్లూరులో వైద్య విద్యార్ధి సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఓ వైద్య విద్యార్ధి సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపింది. నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థి నాగమహేశ్వర్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన మహేశ్వర్ గత రెండు రోజులుగా కాలేజీకి హాజరు కాలేదని, ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో తోటి విద్యార్థులు గది తలుపు బద్దలు కొట్టి చూడగా నాగమహేశ్వర్ ఉరి వేసుకొని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అకడమిక్ స్ట్రెస్ లేదా వ్యక్తిగత సమస్యలు ఆత్మహత్యకు కారణాలు అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Next Story