- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుకే వైద్యరంగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు: ఎమ్మెల్సీ బొత్స
కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేయడంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని (Medical field) ప్రైవేటీకరణ (Privatization) చేయడంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (MLC Botsa Satyanarayana) ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా వైద్యాన్ని ప్రైవేట్‌కు అప్పగించలేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వైద్య రంగాన్ని ప్రైవేటుకు అప్పగించి అక్రమాలకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎప్పుడూ ప్రైవేట్ మనిషేనని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే.. నేడు కూటమి ప్రభుత్వ దానిని నిర్వీర్యం చేసిందని మండి పడ్డాడు.
అలాగే మెడికల్ కాలేజీలను (Medical Colleges) ప్రైవేటు సంస్థలకు ఇవ్వొద్దని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (MLC Botsa Satyanarayana) సూచించాడు. రాష్ట్రంలో యూరియా కొరత పెరిగిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని కొరత కేవలం కూటమి అధికారంలో ఉన్న మన ఏపీలోనే ఎందుకు వచ్చింది ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలాగే యూరియా సమస్యలపై (Urea problems) రైతులతో కలిసి ఈ నెల 9న కూటమి అధికారంలో ఉన్న ఏపీలో యూరియా సమస్య ఎందుకు ఆర్డీవో కార్యాలయాల దగ్గర నిరసనలు చేపడతామని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చాడు.






