ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు

by Thanuru Gopichand |

తెలుగు భాష పరిరక్షణే ధ్యేయంగా మూడో తెలుగు ప్రపంచ మహాసభలు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరులో రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు (Prapancha Telugu Maha Sabhalu) అద్భుతంగా సాగుతున్నాయి. అందులో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను, కళాభిమానులను, తెలుగు భాషాభిమానులను అలరించడంతో పాటు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్ర సారస్వత్ పరిషత్ (Andhra Saraswath Parishad) అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ (Dharam Bir Gokool) ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. సతీసమేతంగా ఆయన తెలుగు మహాసభలకు విచ్చేశారు. వేదిక వద్దకు వచ్చిన వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. వారిని అశ్వరథంపై మహాసభల ప్రధాన వేదిక వద్దకు తీసుకెళ్లారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి ధరమ్ బీర్ గోకుల్ నమస్కరించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌమ ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మహాసభలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తి ఎన్.జయసూర్య, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Next Story