Machilipatnam : అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్ట్ 2025 ప్రారంభం

by Muthe.Rajitha |

ఏపీలోని మచిలీపట్నం(Machilipatnam)లో మసులా బీచ్ ఫెస్టివల్ 2025(Masula Beach Festival 2025) ఘనంగా ప్రారంభం అయింది.

Machilipatnam : అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్ట్ 2025 ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని మచిలీపట్నం(Machilipatnam)లో మసులా బీచ్ ఫెస్టివల్ 2025(Masula Beach Festival 2025) ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) ముఖ్య అతిధిగా హాజరయ్యి, జ్యోతి ప్రజ్వలన చేశారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్(Manginapudi Beach) కు పర్యాటక స్థలంగా ప్రాముఖ్యత కల్పించే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ ఫెస్టివల్ పర్యాటకులకు, జిల్లావాసులకు వినోదం, ప్రత్యేక ఆహార రుచులను అందించనుంది.

ఈనెల 5 నుంచి 8 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో.. జాతీయ స్థాయి సి-కయాకింగ్, కనోయింగ్ బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ తోపాటు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఉండనున్నాయి. స్వాతంత్ర్య, రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా నిలిచిన మచిలీపట్నం చరిత్రను గుర్తు చేసేలా ఈ బీచ్ ఫెస్టివల్ జరుపుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మంత్రి కొల్లు రవీంద్రతోపాటు పలువురు నాయకులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story