AP: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-09 12:14:06  IST  )

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను(IAS Officers) బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను(IAS Officers) బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఓడీలు, పలువురు జాయింట్ కలెక్టర్లు సహా మొత్తం 31 మంది బదిలీ అయ్యారు. గతకొన్ని రోజుల నుంచి సీఎం చంద్రబాబు(CM Chandrababu) దీనిపై కసరత్తు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల స్వయంగా కలెక్టర్లతో సమావేశమై విస్తృతంగా చర్చించారు. తుది జాబితా పూర్తి కావడంతో తాజాగా బదిలీలు చేపట్టారు. కలెక్టర్ల పనితీరుపై ప్రభుత్వం ఇప్పటికే రెండు, మూడు విడతలుగా సమాచారం తెప్పించుకుంది. దాన్ని వడబోసి తుదిజాబితా తయారుచేసినట్లు తెలిసింది.

= వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్‌ జిలానీ సామున్‌

= కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు

= ఏపీపీఎస్సీ సెక్రెటరీగా రవి సుభాష్‌

= ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా శివశంకర్‌ లోతేటి

= పౌరసరఫరాలశాఖ వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌.ఢిల్లీరావు

= ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా పి.రంజిత్‌బాషా

= హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్‌ సీఎండీగా అరుణ్‌బాబు నియమితులయ్యారు.

Next Story