- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంటిలో భారీ చోరీ జరిగింది. 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, నగదు చోరీకి గురైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. చింతలపూడిలోని నివాసంలో ఈ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగల చోరీకి పాల్పడినట్లు సమాచారం. ఉదయాన్నే పనులకు వచ్చిన పనిమనుషులు.. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో దొంగలు వచ్చి ఉంటారని అనుమానించారు. ప్రమీలాదేవికి విషయం చెప్పగా.. ఇంట్లో నగలు, డబ్బు ఉంచిన ప్రదేశాన్ని చూశారు. అక్కడ ఏవీ లేకపోవడంతో వెంటనే చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఇంటి పనిమనుషులతో పాటు.. చుట్టుపక్కల వారికి, అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.






