కుప్పంలో భారీగా రేషన్ బియ్యం సీజ్: కర్ణాటకకు తరలిస్తుండగా పట్టివేత

by Vemula.Srinu Prasad |

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు....

కుప్పంలో భారీగా రేషన్ బియ్యం సీజ్: కర్ణాటకకు తరలిస్తుండగా పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District) కుప్పం నియోజకవర్గం(Kuppam Constituency)లో రేషన్ బియ్యం(Ration Rice) అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గుడిపల్లి మండలం గుత్తార్లపల్లి సమీపంలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 4 టన్నుల రేషన్ బియ్యాన్ని కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వలతో పాటు రవాణాకు సిద్ధంగా ఉన్న ఒక టెంపోను కూడా పోలీసులు సీజ్ చేశారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి, అధిక ధరలకు విక్రయించేందుకు ఈ నిల్వలను సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది.

కుప్పం నుంచి కర్ణాటకకు అక్రమంగా రేషన్ బియ్యం

ఈ బియ్యాన్ని కుప్పం నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలించేందుకు ప్లాన్ చేసినట్లు కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. కేవలం కర్ణాటకకే కాకుండా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా వీరి నెట్‌వర్క్ విస్తరించి ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పార్థసారథి స్పష్టం చేశారు.

Next Story