- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరు ‘జనసేన’లో భారీ ప్రక్షాళన: కమిటీలన్నీ రద్దు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ కమిటీలను రద్దు చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా నాయకుల్లో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు కార్యకర్తలు, మద్దతుదారుల నుంచి అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ..

దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ కమిటీలను రద్దు చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా నాయకుల్లో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు కార్యకర్తలు, మద్దతుదారుల నుంచి అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీని బలోపేతం చేసిన కార్యకర్తలు జిల్లా నాయకత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న వారితో పాటు కమిటీలలోని సభ్యులందరినీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితమే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేసినట్లు గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, అదే తరహా నిర్ణయాన్ని ఇప్పుడు నెల్లూరు జిల్లా విషయంలో కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త కమిటీ నియామకం జరిగే వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.






