Yogandhra : విశాఖ యోగాంధ్రకు భారీ బందోబస్తు: సీపీ బాగ్చి

by Muthe.Rajitha |

Yogandhra : విశాఖ యోగాంధ్రకు భారీ బందోబస్తు: సీపీ బాగ్చి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో జరగనున్న యోగాంధ్ర(Yogandhra)కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు విశాఖపట్నం(Vishakhapatnam) సీపీ శంకబ్రత బాగ్చి(CP Bangchi) పేర్కొన్నారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకొని జరగనున్న యోగాంధ్ర వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ వేడుకల కోసం 12,000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు సిద్ధం చేశామన్నారు. భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు సీసీ కెమెరాలతో పాటు 30 డ్రోన్‌లను నిరంతర నిఘా కోసం ఉపయోగిస్తున్నామన్నారు. ఈ సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేసి నిశితంగా పరిశీలిస్తామని తెలిపారు.

వేడుకలు జరిగే ప్రాంతంలో 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌ల ఉపయోగంపై నిషేధం విధించామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సీపీ బాగ్చి వెల్లడించారు. కాగా ప్రధాని మోడీ హాజరవనున్న యోగాంధ్రలో ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల మేర యోగా కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో మూడున్నర లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది.

Next Story