Breaking:తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో భక్తులు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-03 02:24:20  IST  )

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Breaking:తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో భక్తులు
X

దిశ,వెబ్‌డెస్క్: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. ఈ రోజు(గురువారం) తెల్లవారుజామున తిరుపతి(Tirupati)లోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో మంటలు చెలరేగడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గోవిందరాజస్వామి ఆలయం ముందున్న షాపులో మంటలు చెలరేగాయి. దీంతో ఆలయం ముందున్న చలువ పందిళ్లు తగలబడ్డాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. రెండు దుకాణాలు దగ్ధం అయినట్లు సమాచారం. ఓ దుకాణంలో విద్యుదాఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ ప్రమాదం సమయంలో ఘటన స్థలంలో భక్తులు(Devotees) ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, షాపులో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమయింది.

Next Story