- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
బాణాసంచా పరిశ్రమలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి మృతి చెందారు. ఈ విషాద సంఘటన కోనసీమ జిల్లా రాయవరంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: బాణాసంచా పరిశ్రమ (Fireworks Industry)లో అగ్ని ప్రమాదం (Massive fire) చోటు చేసుకొని ఆరుగురు మృతి (six killed) చెందారు. ఈ విషాద సంఘటన కోనసీమ జిల్లా రాయవరం (Rayavaram)లో చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా పటాకులు తయారు చేస్తుండగా.. గణపతి గ్రాండ్ ఫైర్ వర్స్ (Ganpati Grand Fire Verse) పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పేలుళ్లు సంభవించాయి. దీంతో అందులో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది (Fire crew), ఇతర అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతుండగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More: ఏపీలో ఆరుగురు సజీవదహనం... స్పందించిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి






