ఏపీలో ఆరుగురు సజీవదహనం... స్పందించిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-08 10:25:03  IST  )

కోనసీమ జిల్లా రాయవరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రభుత్వం స్పందించింది....

ఏపీలో ఆరుగురు సజీవదహనం... స్పందించిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక బాణాసంచా కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అందులో పని చేస్తున్న కార్మికులు బయటకు రాలేకపోయారు. మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అధికారులతో మాట్లాడారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలు, సహాయ చర్యలపై అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి అనిత సైతం స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Read More: అత్యంత విషాదకరం.. కోనసీమ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి

Next Story