- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan kalyan:మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగుపడింది.. వారందరికీ కృతజ్ఞతలు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఓ స్కూళ్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఓ స్కూళ్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నిన్న(బుధవారం) తన కుమారుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. గాయాలతో ఉన్న తన కుమారుడిని చూసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి.. మార్క్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఈ క్రమంలో మార్క్ శంకర్(Mark Shanker) కోలుకొంటున్నాడని అన్నారు. కానీ.. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడం వలన మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో నిన్న(బుధవారం) మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఫొటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పవన్ చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఆకాంక్షించారు. ఈ క్రమంలో నిన్న(బుధవారం) జనసేన నాయకులు మార్క్ శంకర్ కోలుకోవాలని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే.. తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్యం పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడు కోలుకోవాలని పూజలు చేసి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. మన వాళ్లందరి ఆశీస్సులు, దేవుడి దయతో మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడిందని ఆయన తెలిపారు.






