Pawan Kalyan: మరో మూడు రోజులు ఆస్పత్రిలోనే మార్క్​ శంకర్​

by Thanuru Gopichand |   (  Updated:2025-04-09 06:14:15  IST  )

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కొంత మెరుగుపడింది.

Pawan Kalyan: మరో మూడు రోజులు ఆస్పత్రిలోనే మార్క్​ శంకర్​
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. సింగపూర్ లోని (Singapore) ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్ నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో పవన్​ కల్యాణ్​ మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇవాళ ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి మార్క్​ శంకర్​ ను మార్చారు

Next Story