పెద్దాపురం మరిడమ్మ జాతరలో గంజాయి బ్యాచ్ హల్ చల్.. పరస్పరం దాడులు

by Vemula.Srinu Prasad |

పెద్దాపురం మరిడమ్మ జాతరలో గంజాయి బ్యాచ్ రక్తం వచ్చేలా పరస్పరం దాడులు చేసుకున్నారు..

పెద్దాపురం మరిడమ్మ జాతరలో గంజాయి బ్యాచ్ హల్ చల్.. పరస్పరం దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) పెద్దాపురం(Peddapuram)లో గంజాయి బ్యాచ్(Cannabis batch) రెచ్చిపోయింది. మరిడమ్మ జాతరలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. గంజాయి, మద్యం మత్తులో కొంతమంది యువకులు పరస్పరం ఘర్షణలకు దిగారు. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. రక్తం వచ్చేలా తలలు పగలకొట్టుకున్నారు. గొడవను అడ్డుకోబోయిన పోలీసులకు సైతం చుక్కలు చూపించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ సైతం గొడవ పెట్టుకున్నారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story