రేపు మావోయిస్టుల బంద్.. ఏజెన్సీ విడిచి వెళ్లండి.. రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో హైఅలర్ట్..!

by Ramesh Naini |   (  Updated:2025-11-22 10:42:53  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ పరిసరాలు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

రేపు మావోయిస్టుల బంద్.. ఏజెన్సీ విడిచి వెళ్లండి.. రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో హైఅలర్ట్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ పరిసరాలు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల 18, 19 తేదీల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టడంతో పాటు ఆంక్షలు కూడా అమల్లోకి తెచ్చారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్‌తో సహా మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజా పరిణామాలతో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల ఒత్తిడి పెరగడంతో, ఏపీ సరిహద్దుల వైపు మావోయిస్టుల కదలికలు పెరిగినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.

ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు రేపు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజాప్రతినిధులు, కీలక నేతలు ఏజెన్సీ ప్రాంతాలు విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచనలు జారీ చేశారు. రంపచోడవరంలోని ప్రధాన రహదారులు, వ్యూహాత్మక ప్రాంతాల్లో గట్టి తనిఖీలు కొనసాగుతున్నాయి. భద్రత విషయంలో ఎలాంటి రాజీపడబోమని పోలీసులు స్పష్టం చేశారు.

Read More... Maoists Surrender: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగుబాటు

' మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి '

Next Story