Maoists : చింతూరు ఏజెన్సీలో కారును దగ్ధం చేసిన మావోయిస్టులు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-10 05:50:00.0  )
Maoists : చింతూరు ఏజెన్సీలో కారును దగ్ధం చేసిన మావోయిస్టులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ(Chintur Agency)లో జాతీయ రహదారిపై వెళుతున్న కారు(Car)ను మావోయిస్టులు(Maoists)దగ్ధం (Fire) చేశారు. చింతూరు నుండి భద్రాచలం వెలుతున్న కారును 30వ నెంబరు జాతీయ రహదారి సరివెల ప్రాంతంలో మావోయిస్టులు అటకాయించారు. కారులోని ప్రయాణికులను దించివేసి అనంతరం కారుకు నిప్పు పెట్టారు. మంటల్లో కారు పూర్తిగా దగ్థమైంది. మావోల దుశ్చర్యతో కారులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.

ఈ నెల 2 నుంచి 9 వరకు మావోయిస్టుల వారోత్సవాల నిర్వాహణలో భాగంగా తమ ఉనికిని చాటుకునే క్రమంలోనే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. చాల నెలల తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు విధ్వంసక ఘటనకు పాల్పడటం కలకలం రేపింది. ఒడిషా, చత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోలకు ఎదురుదెబ్బలు తగలడంతో తిరిగి ఏపీ వైపు మావోలు దృష్టి పెట్టవచ్చని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో తిరిగి మావోల వేట కోసం కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed