ఆ ముగ్గురిని శిక్షించండి.. హైకోర్టులో మావోయిస్టు అగ్రనేత కేశవరావు తల్లి పిటిషన్

by Gantepaka Srikanth |

మావోయిస్టు(Maoist) పార్టీ నేతలు నంబాల కేశవరావు(Keshava Rao), సజ్జా నాగేశ్వరావుల మృతదేహాలను బంధువులకు అప్పగిస్తానని సాక్షాత్తు కోర్టులో హామీ ఇచ్చి.. ఆ తర్వాత ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే.

ఆ ముగ్గురిని శిక్షించండి.. హైకోర్టులో మావోయిస్టు అగ్రనేత కేశవరావు తల్లి పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు(Maoist) పార్టీ నేతలు నంబాల కేశవరావు(Keshava Rao), సజ్జా నాగేశ్వరావుల మృతదేహాలను బంధువులకు అప్పగిస్తానని సాక్షాత్తు కోర్టులో హామీ ఇచ్చి.. ఆ తర్వాత ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే.. హామీ ఇచ్చి నిరాకరించిన అధికారులను శిక్షించాలని మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లీశ్వరరావు పౌర హక్కుల సంఘం నేతలతో కలిసి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్ నిన్న(సోమవారమే) దాఖలు చేయగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నమోదు కాలేదు. ఈరోజు(మంగళవారం) కేసు నమోదైంది. గురువారం విచారణకు రానుంది. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ(Chhattisgarh Government) ప్రధాన కార్యదర్శి అమితాబ్ జైన్, ఆ రాష్ట్ర డీజీపీ అరుణ దేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ IG సుందర్ రాజ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.ప్రసాద్ మీడియాకు సమాచారం ఇచ్చారు.

Next Story