Maoist Bund: ఆ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల నిలిపి వేత.. ఎందుకంటే?

by Thanuru Gopichand |

ఆపరేషన్ కగార్‌ పేరుతో ప్రభుత్వం మావోయిస్టులపై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది.

Maoist Bund: ఆ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల నిలిపి వేత.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆపరేషన్ కగార్‌ పేరుతో (Operation Kagar) ప్రభుత్వం మావోయిస్టులపై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది. అగ్రనాయకుల ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఈ రోజు దేశ వ్యాప్త బంద్‌కు మావోయిస్టులు (Maoist) పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో ఏవోబీలో హై అలర్ట్​ప్రకటించారు. ప్రత్యేక బలగాలు ముమ్మంగా కూంబింగ్​చేస్తూ ఏవోబీని (AOB) జల్లెడ పడుతున్నాయి. ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీలు చేపడు తున్నారు. బంద్ నేపథ్యంలో (Bund) అధికారుల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసుల నిలిపివేశారు. విశాఖ-భద్రాచలం నైట్ సర్వీసులు కూడా నిలిపివేశారు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు స్మారక సభలు నిర్వహించనున్నట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. 2024 నుంచి 540 మంది మావోయిస్టులు మరణించారని, చర్చలకు సిద్ధమని చెప్పినా ఆపరేషన్ కగార్ ఆపడంలేదని ఆరోపిస్తున్న మావోయిస్టు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గతంలో ఒక లేఖ విడుదల చేశారు.

Next Story