విజయవాడలో మావోయిస్టుల కలకలం.. బిల్డింగ్‍లో 10 మంది మావోయిస్టులు

by Prasad Jukanti |   (  Updated:2025-11-18 09:38:00  IST  )

హిడ్మా ఎన్ కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టులు తలదాచుకోవడం కలకలం రేపింది.

విజయవాడలో మావోయిస్టుల కలకలం.. బిల్డింగ్‍లో 10 మంది మావోయిస్టులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‍కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల (Maoists) కలకలం రేగింది. కానూరులోని ఓ బిల్డింగ్ లో 10 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆ భవనాన్ని గ్రేహౌండ్స్ (Greyhounds) దళాలు చుట్టుముట్టాయి. వారిలో నలుగురు మావోయిస్టులను పట్టుకోగా మరో ఆరుగురు మావోయిస్టులు పరారయ్యారు. పట్టుబడిన వారిని టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తరలిస్తున్నారు. మరో వైపు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు ఇవాళ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా (Hidma encounter) చనిపోయారు. ఆయనతో పాటు ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిసా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఎన్ కౌంటర్ సంభవించింది.

Read More... BREAKING: భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి

Next Story