- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్యం జిల్లా : తాళాలు పగలగొట్టి మరీ చోరీలు
తీర్థయాత్రలు.. శుభకార్యాలకు వెళ్లిన వారి ఇల్లు గుల్ల చేస్తున్న కిలాడీ దొంగలు.

దిశ, వెబ్ డెస్క్ : పార్వతీపురం మన్యం జిల్లాలో (Parvathipuram Manyam District) దొంగలు హల్‌చల్ సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా కురుపాం మండల కేంద్రంలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ హడలెత్తిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం తాజాగా కురుపాంలో ఒకే రాత్రి మూడు ఇళ్లలో తాళాలు పగలగొట్టి మరీ భారీగా బంగారం (Gold), వెండి (Silver) ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు. ఈ దొంగతనాల్లో కిలాడీ దొంగలు (Thieves) ఒక పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. తీర్థయాత్రలకు, శుభకార్యాలకు ఊరికి వెళ్లిన వారి ఇండ్లను ముందుగానే గుర్తించి, తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీలకు పాల్పడుతున్నారు. బాధితులు తిరిగి వచ్చేసరికి తమ ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటం, బీరువాలోని విలువైన వస్తువులు మాయమవ్వడం చూసి లబోదిబోమంటున్నారు. వరుస దొంగతనాల వార్తలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నిఘాను పెంచినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని, నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠా కదలికలపై నిఘా ఉంచాలని గ్రామస్తులు పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నారు.






