- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్యం జిల్లా | వృద్ధురాలికి అస్వస్థత.. తప్పని డోలీ మోత
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లు తయారైంది మన్యం జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల పరిస్థితి.

దిశ, వెబ్ డెస్క్ : రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లు తయారైంది మన్యం జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల పరిస్థితి. అత్యవసర సమయాల్లో ఊరు దాటాలంటే డోలీ మోతలు తప్పడం లేదు. సరైన వాహనాలు లేక రాకపోకలకు అవస్థలు పడాల్సిన పరిస్థితి. కొండలు, గుట్టలను ప్రమాదకరంగా దాటుతూ గర్భిణిలను, వయసు పైబడిన వారిని డోలీల్లో తీసుకెళ్తున్నారు గిరిజన గ్రామాల ప్రజలు. ఇటువంటి సంఘటనే మరొకటి మన్యం జిల్లా (Manyam District) కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామంలో (Rebba Village) వెలుగు చూసింది. గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇటీవల అస్వస్థతకు గురైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు. దీంతో గ్రామస్తులు తప్పని పరిస్థితిలో ఆమెను డోలీలో ఆసుపత్రికి మోసుకెళ్లారు. నాగావళి నదిని ప్రమాదకర పరిస్థితుల్లో దాటి ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






