- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Manikya Varaprasad: వైసీపీలో చేరితే రాజకీయ అత్యాచారమే.. మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీలో చేరితే అది రాజకీయ అత్యాచారంతో సమానమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ (Former Minister Dokka Manikya Varaprasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ (Former Minister Shailajanath) వైఎస్సార్‌సీపీ (YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఉదయం ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan) సమక్షంలో శైలజానాథ్ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామాలపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య ఘాటు రియాక్ట్ అయ్యారు. వైసీపీలో చేరితే రాజకీయ అత్యాచారమేనని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన శైలజానాథ్‌కు కీలక సూచనలు చేశారు. పార్టీలో చేర్చుకునేటప్పుడు వైసీపీలో నేతలందరూ అప్యాయంగా ఉంటారని.. ఆ తరువాతే రాజకీయ అత్యాచారం చేయిస్తారని ఫైర్ అయ్యారు. వైసీపీలో నైతిక విలువలు తావు లేదని.. అదో దుర్మార్గమైన పార్టీ అని మండిపడ్డారు. జగన్ పార్టీలో దళితులకు స్థానం లేదన్న డొక్కా ఆ పార్టీలో చేరికతో రాజకీయంగా సమాధి తప్పదని తెలిపారు.
కాగా, పార్టీలో చేరిన శైలజానాథ్ (Shailajanath)ను మాజీ సీఎం జగన్ (Former CM Jagan) శింగనమల (Shinganamala) వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌గా నిమమించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapur)లో శింగనమల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన ఉంది. అక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉండగా శైలజనాథ్ ఆ పార్టీ అభ్యర్థిగా శింగనమల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత టీడీపీ (TDP) నుంచి శమంతకమణి (Shamanthakamani), ఆమె కుమార్తె యామిని బాల (Yamini Bala) మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి (Jonnagadda Padmavati) ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా సాధించుకోలేకపోయారు.