- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మోడీకి జగన్ భయపడినంతగా.. ఇంకెవరూ భయపడరు’.. ఠాగూర్ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఏపీ మాజీ సీఎం జగన్(Jagan) మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్(Manickam Tagore) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఏపీ మాజీ సీఎం జగన్(Jagan) మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్(Manickam Tagore) స్పందించారు. బుధవారం ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌లా అమిత్ షాకి రాహుల్ గాంధీ లొంగిపోలేదు. జగన్‌లా మోడీని చూసి రాహుల్ గాంధీ భయపడరు అని ఠాగూర్ ఎద్దేవా చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ పోరాటం కేవలం కాంగ్రెస్ కోసం కాదని చెప్పారు. ప్రజాస్వామ్యం కోసమే రాహుల్ పోరాడుతున్నారని అన్నారు. జగన్‌కు దమ్ముంటే ఓట్ల చోరీపై పోరాడాలని సూచించారు. రేపు విజయవాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేపట్టబోయే ర్యాలీలో పాల్గొనాలని జగన్‌కు ఠాగూర్ హితవు పలికారు. కాగా, తాడేపల్లిలో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని, ప్రజాస్వామ్యం లేదని అనడానికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు. అత్యంత అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని ఆరోపించారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ గురించి కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో జరిగిన ఓట్ల అవకతవకల గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని జగన్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు రోజూ రాహుల్ గాంధీతో ఫోన్లో టచ్‌లో ఉన్నారని కీలక ఆరోపణలు చేశారు.






