పోలీస్ కస్టడీకి మాజీ ఎంపీ నందిగం సురేష్

by Naga Rani Yarlagadda |

టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు అనే వ్యక్తిపై దాడికేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh)ను మంగళగిరి కోర్టు (Mangalagiri Court) పోలీస్ కస్టడీకి అనుమతించింది.

పోలీస్ కస్టడీకి మాజీ ఎంపీ నందిగం సురేష్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు అనే వ్యక్తిపై దాడికేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh)ను మంగళగిరి కోర్టు (Mangalagiri Court) పోలీస్ కస్టడీకి అనుమతించింది. మే 18వ తేదీ సాయంత్రం నందిగం సురేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరు పరచగా జూన్ 2 వరకూ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన గుంటూరు సబ్ జైల్లోనే ఉన్నారు. సోమవారం తుళ్లూరు పోలీసులు మరోసారి నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టుకు తీసుకెళ్లి కస్టడీకి ఇవ్వాలని కోరగా.. అందుకు కోర్టు అనుమతించింది. మే 28, 29, 30 తేదీల్లో ఆయన్ను పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. కాగా.. గతంలో అమరావతిలో ఓ మహిళ హత్యకేసులో నందిగం సురేష్ 3 నెలలపాటు జైల్లో ఉండి బెయిల్ పై విడుదలయ్యారు.

Next Story